ధరల హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా పసిడి కొనుగోళ్లు సాగుతూనే ఉంటాయి.. కాకపోతే, కొన్నిసార్లు పడిపోవచ్చు.. మళ్లీ పెరగొచ్చు.. మరోసారి స్వల్పంగా పెరిగింది బంగారం ధ.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,360కు చేరింది.. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 మాత్రమే పెరగడంతో రూ. 52,760కి ఎగబాకినట్టు అయ్యింది.
Read Also: Paytm: ఇక పేటీఎం వంతు.. యూజర్లకు భారీ షాక్..!
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది.. రూ. 500 పెరగడంతో.. కిలో వెండి ధర రూ.67,500గా పలుకుతోంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.. 0.18 శాతం పడిపోవడంతో బంగారం ధర ఔన్స్‌కు 1872 డాలర్లకు చేరుకోగా.. వెండి ధర 1.05 శాతం క్షీణించడంతో ఔన్స్‌కు 21.69 డాలర్లుగా పలుకుతోంది.
