Site icon NTV Telugu

మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర

Gold

Gold

పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి బంగారం ధర తగ్గింది.. మంగళవారం రోజు కాస్త పైకి కదిలిన పుత్తడి ధర.. ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గడంతో.. రూ.48,660కు దిగివచ్చింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గడంతో రూ.44,600కు క్షీణించింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటే పట్టింది.. వెండి రేటు రూ.200 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.71,900 క్షీణించింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర దిగివచ్చింది.. పసిడి ధర 0.02 శాతం తగ్గడంతో ఔన్స్‌కు 1799 డాలర్లకు చేరింది.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది.. ఔన్స్‌కు 0.34 శాతం పెరుగుదలతో 24.72 డాలర్లకు పెరిగింది..

Exit mobile version