Site icon NTV Telugu

స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. వెండి మాత్రం..

బంగారం ధర పెరిగినా.. తగ్గిన భారత్‌లో దానికి ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గదు.. అయితే, మరోసారి స్వల్పంగా పెరిగింది పసిడి దర.. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు కాస్త పైకి కదిలింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుదలకు తోడు.. దేశీయంగా డిమాండ్‌తో మరోసారి పసిడి ధర పెరిగింది.. ఇదే సమయంలో.. వెండి ధర మాత్రం దిగివచ్చింది.. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 49,300కు చేరింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ. 45,200 చేరగా.. వెండి ధర మాత్రం రూ.100 క్షీణించడంతో కిలో వెండి ధర రూ.64,900కు దిగివచ్చింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర పైకే కదిలింది.. ఔన్స్‌కు 0.03 శాతం పెరిగి 1822 డాలర్లకు చేరింది… కానీ, వెండి మాత్రం కిందకు దిగింది.. ఔన్స్‌కు 0.39 శాతం తగ్గుదలతో 22.98 డాలర్లకు క్షీణించింది వెండి ధర.

Read Also: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్.. రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ..

Exit mobile version