Gold and Silver Price: పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ వరుసగా దిగివస్తున్నాయి బంగారం ధరలు.. దేశీయ బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా పతనమైన బంగారం ధర ఈరోజు కూడా మరింత కిందకు దిగివచ్చింది.. క్రితం రోజు ట్రేడింగ్‌లో పెరిగిన వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. క్రితం వారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులను కొనసాగించాయి. మొత్తంగా ఫిబ్రవరి నెల లావాదేవీల్లో ధరల హెచ్చుతగ్గుల ట్రెండ్ కొనసాగింది. ఈరోజు కిలో వెండి ధర రూ.450 తగ్గింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఎటువంటి మార్పు లేకుండా రూ.57,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 450. తగ్గడంతో రూ.69,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం ఇలా ఉన్నాయి.. చెన్నైలో రూ.57,980, ముంబైలో రూ.57,160, ఢిల్లీలో రూ.57,310, కోల్‌కతాలో రూ.57,160, బెంగళూరులో రూ.57,210, హైదరాబాద్‌లో రూ.57,160, కేరళలో రూ.57,160, పూణెలో రూ. 57,160, మంగళూరులో రూ. 57,210, మైసూర్‌లో రూ. 57,210, విజయవాడ, విశాఖపట్నంలో రూ.57,160గా ట్రేట్ అవుతుంది.. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. చెన్నైలో రూ 53,150, ముంబైలో రూ.52,400, ఢిల్లీలో రూ.52,550, కోల్‌కతాలో రూ.52,400, బెంగళూరులో రూ.52,450, హైదరాబాద్‌లో రూ.52,400, కేరళలో రూ.52,400, పూణేలో రూ.52,400, మంగళూరులో రూ. 52,450, మైసూర్‌లో రూ. 52,450, విజయవాడ, విశాఖపట్నంలో 52,400గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండి ధర బెంగళూరులో రూ.72,000, మైసూర్‌లో రూ. 72,000, మంగళూరులో రూ.72,000, ముంబైలో రూ.రూ.69,950, చెన్నైలో రూ.72,000, ఢిల్లీలో రూ.69,950., హైదరాబాద్‌లో రూ. 72,000, కోల్‌కతాలో రూ.69,950. విజయవాడ, విశాఖలో రూ.72,000గా పలుకుతోంది.