Gold and Silver Price: క్రమంగా భారీ పెరిగి కాస్త బ్రేక్ తీసుకున్నాయి పసిడి ధరలు.. దీంతో, సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు ఏమీ నిల్వ లేదు.. ఎందుకంటే.. పసిడి ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి.. నిన్నటి నుంచి పసిడి పరుగు తిరిగి ప్రారంభమైంది.. ఇవాళ కూడా అదే దూకుడు కనిపిస్తోంది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380కి ఎగిసింది. దీంతో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా పలుకుతోంది.. ఇక, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350గా ట్రేడ్ అవుతోంది.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,600గా.. 24 క్యారెట్ల ధర రూ.57,380గా పలుకుతోంది..
Read Also: INDvsAUs 1st Test: భారత్ 400 ఆలౌట్..కంగారూలపై 223 రన్స్ లీడ్
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380గా ఉంది.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,400గా.. 24క్యారెట్ల బంగారం ధర రూ.58,250కు చేరింది.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,340కి ఎగిసింది.. ఇక, కేరళ, పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 ఉండగా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా ట్రేడ్ అవుతోంది.. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 దగ్గర ట్రేడ్ అవుతోంది.. మరోవైపు వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,500గా, విజయవాడలో రూ.70,800గా, ఢిల్లీలో రూ.70,800గా, ముంబైలో రూ.70,800గా, కోల్‌కతాలో రూ.70,800గా, చెన్నైలో రూ.72,500గా కొనసాగుతోంది. అయితే, ఇప్పట్లో పసిడి పరుగు ఆగదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..