పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్.. వరుసగా పెరుగుతూ.. మరోసారి షాక్ఇచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార 45వేల 900 రూపాయలుగా ఉండింది. నిన్నటితో పోలిస్తే 90 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 50వేల 50 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే 130 రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా కాస్త తగ్గింది. కిలో వెండి 63వేల 659 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు తగ్గాయి. ఉక్రెయిన్ సంక్షోభంగా కారణంగా ఎగబాకిన బంగారం ధరలు… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు చర్చలకు అంగీకరించడంతో కాస్త తగ్గాయి. ఔన్స్ బంగారంపై 0.2 శాతం తగ్గింది.
Read Also: Sonia Gandhi: మోడీ, యోగీ ప్రభుత్వాలతో అన్ని వర్గాలకు అన్యాయం