పసిడి ధరలో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరోజు బంగారం ధర పైకి కదిలితే.. మరోరోజు కిందికి దిగివస్తున్నాయి.. అయితే, ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా కొనసాగుతూ రూ.49,850గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700గా ఉంది.. ఇదే సమయంలో వెండి ధర మాత్రం కాస్త దిగివచ్చింది.. సిల్వర్ ధర రూ.100 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.66,000కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గి 1802 డాలర్లకు దిగిరాగా.. వెండి ధర ఔన్స్‌కు 0.81 శాతం తగ్గుదలతో 22.34 డాలర్లకు పడిపోయింది.
పసిడి ధర ఇవాళ ఇలా..
