NTV Telugu Site icon

Gold and Silver Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధర.. వెండిది అదే దారి..

Gold And Silver Rate

Gold And Silver Rate

Gold and Silver Price: మరోసారి వరుసగా పైకి కదులుతూ సామాన్యులకు అందనంత దూరం వెళ్తున్నాయి పసిడి ధరలు.. వెండి కూడా పసిడి బాట పట్టింది.. అయితే, ఇవాళ బంగారం కొనుగోలు దారులకు కాస్త రిలీప్ దొరికినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇవాళ పసిడి ధరలు కాస్త కిందికి దిగివచ్చాయి.. బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ. 200 వరకు తగ్గింది.. మరోవైపు కిలో వెండి ధర రూ.300 వరకు తగ్గింది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్న తరుణంలో.. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు..

Read Also: Anchor Falls: యాంకర్‌పై పడిపోయిన ఫీల్డర్.. నవ్వులే నవ్వులు

ఇక, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100గా ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,350గా ఉంది.. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000కి తగ్గింది.. ఇక, చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,790గా.. 22 క్యారెట్ల ధర రూ. 52,980గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల మంగాల ధరం రూ. 56,781గా ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ. 52,050గా ఉంది.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730గా.. 22 క్యారెట్ల ధర రూ. 52,000కు చేరింది.. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730కి తగ్గితే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000కి చేరింది.. మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే కొలో వెండి ధర హైదరాబాద్‌లో రూ. 74,800, విజయవాడలో రూ. 74,800, ఢిల్లీలో రూ. 72,200, ముంబైలో రూ. 72,200గా, చెన్నైలో రూ. 73,500గా, బెంగుళూరులో రూ. 73,500గా పలుకుతోంది.