రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కామర్స్ సంస్థలే కాదు విమానయాన సంస్థలు కూడా ప్రత్యేకంగా పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ విమానయాన కంపెనీ ‘గో ఫస్ట్’ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిపబ్లిక్ డే సందర్భంగా విమాన టిక్కెట్లను అత్యంత చౌకగా అందుబాటులోకి తెచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా ‘రైట్ టూ ఫ్లై’ పేరుతో రూ.926కే విమాన ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
Read Also: రిపబ్లిక్ డే సందర్భంగా ‘హ్యాపీ’ ఆఫర్లు
ఈ ఆఫర్‌ను పొందేందుకు ప్రయాణికులు జనవరి 22 నుంచి జనవరి 26 మధ్యలో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని గో ఫస్ట్ సంస్థ సూచించింది. ఆ తర్వాత బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఫిబ్రవరి 11, 2022 నుంచి మార్చి 31, 2022 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ టిక్కెట్‌పై విమాన ప్రయాణం చేస్తూ 15 కేజీల లగేజీ బ్యాగ్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ కేవలం వన్ వే మార్గాలకు మాత్రమే ఉంది.
