NTV Telugu Site icon

German Railways: భారత్‌ నుంచి లోకో పైలట్‌లను రిక్రూట్ చేసుకున్న జర్మన్ రైల్వే..

German Railways

German Railways

జర్మనీకి చెందిన ప్రభుత్వ రైల్వే కంపెనీ డ్యూయిష్ బాన్ (డీబీ) తన గ్లోబల్ ప్రాజెక్ట్‌ల కోసం భారతదేశం నుంచి లోకో పైలట్‌లను నియమించుకోవడం ప్రారంభించింది. మెట్రో సిస్టమ్స్ కోసం కన్సల్టెన్సీ, ఆపరేషన్స్, మెయింటెనెన్స్‌ని అందించడం ద్వారా కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి కూడా విస్తరించాలనుకుంటోంది. భారతదేశంలోని అనేక నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. కంపెనీ ఇటీవలే భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ వేగవంతమైన రైలు రవాణా సేవ (RRTS) అనగా నమో భారత్‌ను నడుపుతూ ఒక సంవత్సరం పూర్తి చేసింది. జూలై 2022లో, డీబీ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ ని 12 సంవత్సరాల పాటు నిర్వహించడానికి హక్కులను పొందింది.

READ MORE: Samsung: శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. డిటైల్స్ ఇవే

డీబీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ సీఈవో నికో వార్బనోఫ్.. జర్మనీలో రైలు డ్రైవర్ల కొరత ఉందని, గ్లోబల్ ప్రాజెక్ట్‌లలో భారతీయ ఉద్యోగులను ఉపయోగించాలనుకుంటున్నామని ఓ జాతీయ మీడియాకు తెలిపారు. దాదాపు 100 మంది ఉద్యోగులకు గ్లోబల్ పాత్రల కోసం శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. కంపెనీకి భారతదేశంలో 600 మంది ఉద్యోగుల అవసరం ఉంది. ఘజియాబాద్‌లోని దుహై, పరిసర ప్రాంతాల నుంచి కంపెనీ ఉద్యోగులను నియమించుకున్నట్లు వార్బనోఫ్ చెప్పారు.

READ MORE:Film Chamber Committee: ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా మంత్రి

తాము ఒక సంవత్సరం క్రితం భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించామని.. తమ 600 మంది ఉద్యోగులతో 42 కి.మీ విస్తీర్ణంలో విజయవంతంగా ఆర్ఆర్‌టీఎస్ సేవలను నడుపుతున్నామని నికో వార్బనోఫ్ అన్నారు. కంపెనీకి భారత్ వ్యూహాత్మక మార్కెట్ అని ఆయన కొనియాడారు. జూలై 2022లో 12 సంవత్సరాల పాటు ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ నిర్వహణ హక్కులను కంపెనీ పొందింది. ఈ ఒప్పందం విలువ ₹1,000 కోట్ల కంటే ఎక్కువ. సమగ్ర ఆపరేషన్, నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ పార్టీకి అప్పగించడం ఇదే మొదటిసారి.