Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్‌తో సరికొత్త చరిత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అమెరికాలో ఊహించని విజయం వరించింది. అదానీ గ్రూప్, గౌతమ్ అదానీపై అమెరికాలో ఉన్న అన్ని రకాల చట్టపరమైన వివాదాలు, పాత కేసులను ఉపసంహరించుకునే దిశగా అమెరికా న్యాయ శాఖ అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన అడుగు వేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదానీ గ్రూప్ అగ్రదేశంలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.84,000 కోట్లకు పైగా) భారీ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆయనకు ఈ భారీ ఊరట లభించడం గమనార్హం.
$10 బిలియన్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో మారిన సీన్
అదానీ గ్రూప్, గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా గతంలో ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నింటినీ పూర్తిగా తొలగించేందుకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం సోమవారం వేగంగా చర్యలు చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలలో ఒకరైన గౌతమ్ అదానీ సాధించిన ఈ విజయం, ఆయన వ్యాపార దృక్పథం ఎంత పారదర్శకమైనదో నిరూపిస్తోందని చెబుతున్నారు. రాయటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి రంగాలలో అదానీ గ్రూప్ ఈ 10 బిలియన్ డాలర్ల మెగా పెట్టుబడిని పెట్టనుందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే పాత వివాదాలు తొలగిపోవడం అత్యంత కీలకంగా మారింది. దీంతో వాటిపై అమెరికా ప్రభుత్వం సానుకూల ముద్ర వేసిందని చర్చించుకుంటున్నారు.
Also Read
- Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ 'లాక్డౌన్' లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ఇదే సమయంలో అదానీ గ్రూప్ తన గ్లోబల్ విస్తరణను వేగవంతం చేస్తూ, అమెరికాలోని ఆర్థిక – పౌర వ్యవహారాలను పూర్తిగా పరిష్కరించుకుంది. అమెరికా ఆర్థిక శాఖతో సోమవారం 275 మిలియన్ డాలర్ల బారీ సెటిల్మెంట్ ఒప్పందం కుదిరింది. అలాగే ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ (SEC) తో నడుస్తున్న ఒక పాత వివాదాన్ని కూడా ఈ కంపెనీ క్లోజ్ చేసుకుంది. దీనికి అమెరికా కోర్టు నుంచి అధికారిక ఆమోదం లభించడమే ఇక బ్యాలెన్స్ ఉంది. అమెరికా వంటి అత్యంత కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్న దేశంలో అన్ని రకాల లీగల్ ప్రాసెస్స్ను సక్సెస్‌ఫుల్‌గా దాటడం ఒక భారతీయ కంపెనీకి దక్కిన అరుదైన గౌరవంగా చెబుతున్నారు. ఈ అంతర్జాతీయ అడ్డంకులు పూర్తిగా తొలగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అదానీ గ్రూప్ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో విదేశీ మార్కెట్లలో అనివార్య కారణాలతో ఆగిపోయిన అదానీ గ్రూప్ ప్రాజెక్టులన్నీ ఇకపై రెట్టింపు వేగంతో దూసుకెళ్తాయని చెబుతున్నారు. ఈ 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే .. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారతదేశం – అదానీ గ్రూప్ పరపతి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్‌తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!