NTV Telugu Site icon

SBI: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకం

Sbi

Sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో శనివారం ఎంపిక చేసింది. శెట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ వర్టికల్స్‌ను ఆయన చూస్తుంటారు.

ఇది కూడా చదవండి: IND vs SA T20 World Cup 2024 Final Live Updates: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌.. లైవ్ అప్‌డేట్స్

ప్రస్తుతం ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా పదవీకాలం ఆగస్టు 28తో 63 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన స్థానంలో శెట్టి బాధ్యతలు చేపట్టనున్నారు. అనుభవం, పనితీరును బట్టి శెట్టి నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: MLA Bode Prasad: లబ్ధిదారులకు ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లు..

 

శ్రీనివాసులు శెట్టి 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు. 2020లో ఎస్‌బీఐ బోర్డులో ఎండీగా నియమితులయ్యారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌లో విశేష అనుభవం ఉంది. అయితే ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫార్సు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.