Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య విదేశీ పెట్టుబడిదారులు (FPIs) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ మే నెలలో ఇప్పటివరకు వారు రూ. 27,048 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 2026 లో మొత్తం ఎఫ్‌పీఐ అవుట్‌ఫ్లోలు రూ. 2.2 లక్షల కోట్లకు చేరాయి. ఇది 2025 మొత్తం సంవత్సరంలో ఉపసంహరించుకున్న రూ. 1.66 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా నిలిచారు. జనవరిలో రూ. 35,962 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 lakh కోట్ల ఉపసంహరణ జరిగింది. ఏప్రిల్ నెలలో రూ. 60,847 కోట్లు, మే నెలలో ఇప్పటి వరకు రూ. 27,000 కోట్లకు పైగా ఉపసంహరణలు జరిగాయి.
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా నిపుణుడు హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి, కీలక ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎఫ్‌పీఐల నిరంతర విక్రయాలు, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు (CAD) రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని తెచ్చాయని పేర్కొన్నారు. ఏడాది ఆరంభంలో డాలర్‌తో పోలిస్తే రూ. 90 వద్ద ఉన్న రూపాయి విలువ.. మే 15 నాటికి చారిత్రాత్మక అత్యల్ప స్థాయి రూ. 96.14కు పడిపోయింది.. దీని వల్ల ఇన్వెస్టర్లు భయాందోళనకు గురయ్యి.. తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
ముడిచమురు ధరలు పెరిగి, ఎఫ్‌పీఐల విక్రయాలు ఇలాగే కొనసాగితే రూపాయి మరింత బలహీనపడే ప్రమాదముంది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కంపెనీల్లోకి భారీగా నిధులు తరలిపోతుండటం వల్ల, ఏఐ రంగంలో వెనుకబడి ఉన్న భారత మార్కెట్ నుంచి నిధులు దారి మళ్లుతున్నాయి. అయితే.. ప్రస్తుతం బబుల్ జోన్లో ఉన్న ఏఐ ట్రేడింగ్ కాస్త చల్లబడినప్పుడు ఈ ట్రెండ్ మళ్లీ మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!