Site icon NTV Telugu

5 నిమిషాల్లో రూ. 4 ల‌క్ష‌ల కోట్లు…

ఎప్పుడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒక్క‌సారిగా కుప్ప‌కూలాయి. మార్చి నెల‌లో వ‌డ్డీరేట్లు పెంచే అవ‌కాశం ఉన్న‌ట్టు అమెరికాకు చెందిన ఫెడ‌ర‌ల్ బ్యాంకు సూచించ‌డంతో దాని ప్ర‌భావం మార్కెట్‌పై ప‌డింది. ఆసియా మార్కెట్‌తో పాటు ఇండియా మార్కెట్లు ఒక్క‌సారిగా కుదేల‌య్యాయి. కేవ‌లం 5 నిమిషాల వ్య‌వ‌ధిలో రూ. 4 ల‌క్ష‌ల కోట్లు మ‌దుప‌ర్ల సంప‌ద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రారంభమైన వెంట‌నే 1100 పాయింట్లు న‌ష్ట‌పోయింది. అమెరికాలో ద్ర‌వ్యోల్భ‌ణం గ‌రిష్ట‌స్ధాయిలో ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగ విప‌ణి బ‌లంగా ఉంద‌ని, వ‌డ్డీ రేట్లు పెంచేందుకు ఫెడ‌ర‌ల్ బ్యాంకు మొగ్గుచూపుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో మార్కెట్లు ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాయి.

Read: పారాసిట‌మాల్ జ్వ‌రానికే కాదు… పాముల‌ను చంపేందుకు కూడా ఉప‌యోగిస్తార‌ట‌…

వ‌డ్డీరేట్లు 0.25 శాతం వ‌ర‌కు ఉండొచ్చ‌ని ఫెడ‌ర‌ల్ బ్యాంక్ పేర్కొన్న‌ది. అంతేకాదు అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు మ‌రింత వేడెక్కుతున్నాయి. ప్ర‌స్తుతం బ్యారెల్ ధ‌ర 90 డాల‌ర్లు దాటింది. రాబోయే రోజుల్లో ఇది 100 డాల‌ర్లు దాటే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితులు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్ర‌భావాన్ని చూపుతున్నాయి.

Exit mobile version