Site icon NTV Telugu

Raghuram rajan: ప్రభుత్వ రుణాలు చాలా ప్రమాదకరం

Raghuramrajan

Raghuramrajan

ప్రభుత్వ రుణాలు చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దీని వలన అమెరికాకు చాలా నష్ట జరిగిందని తెలిపారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో రఘురామ్ రాజన్ ప్రసంగించారు.

ఇది కూడా చదవండి: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇప్పుడైనా పదవులు వస్తాయా?

ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని రఘురామ్ రాజన్ సూచించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయని.. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. వచ్చే ఏడాది వైట్‌హౌస్‌లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు.

ఇది కూడా చదవండి:Hyderabad: రేపు తెలంగాణ ఒలింపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు..

Exit mobile version