Site icon NTV Telugu

ఆకాశంలో ఎగిరే కార్లు వ‌చ్చేశాయి… ధ‌ర ఎంతో తెలుసా?

సాధార‌ణ రోజుల్లో బ‌య‌ట‌కు వ‌స్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో ఆగిపోవాల్సి వ‌స్తుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా ఎగిరే కార్లు వ‌స్తే ట్రాఫిక్ క‌ష్టాలు తీరిపోతాయి క‌దా అనుకున్నాం. కాగా, త్వ‌ర‌లోనే రోడ్ల‌మీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్ర‌యాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజ‌దాని బ్లాటిస్లావాలోని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఎగిరే కారు విష‌యంలో ముంద‌డుగు ప‌డింది.

Read: ఓటిటిలో ‘రాధేశ్యామ్’… అసలు విషయం వెల్లడించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

గంట‌కు 300 కిమీ వేగంతో 82 వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణం చేసే కారుకు ఎయిర్ వ‌ర్తీనెస్ స‌ర్టిఫికెట్‌ను జారీ చేసింది స్లోవేకియా ప్ర‌భుత్వం. సుమారు 70 గంట‌ల‌పాటు టెస్ట్ డ్రైవింగ్‌ను నిర్వ‌హించారు. 500 కిమీ ప్ర‌యాణం చేయ‌డానికి 28 లీట‌ర్ల పెట్రోల్ స‌రిపోతుంద‌ని, దీని ఖ‌రీదు రూ. 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని క్లెయిన్ విజ‌న్ కంపెనీ స్ప‌ష్టం చేసింది. త్వ‌ర‌లోనే ఈ కారు లండ‌న్ నుంచి ప్యారిస్‌కు ప్ర‌యాణం చేయ‌నుంద‌ని స‌మాచారం.

Exit mobile version