Site icon NTV Telugu

Flipkart Year End Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023.. ఆ ఫోన్ల పై భారీ తగ్గింపు..

Flipkart Year End Sale 2023

Flipkart Year End Sale 2023

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తూ వస్తుంది.. పండగలకు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఏదొక సేల్ పేరుతో ఆఫర్స్ ను అందిస్తుంది.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. ముందుగా ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారి కోసం ఈ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.. మిగతా వారందరికి డిసెంబర్ 9 నుంచి స్మార్ట్‌ఫోన్లపై డీల్‌లను యాక్సెస్ చేససుకోవచ్చు. మునుపటి పండుగ విక్రయాలను కోల్పోయిన వినియోగదారులకు మరో అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.. ఈ సేల్ ఈనెల 16 వరకు అందుబాటులో ఉంటుంది..2023 ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి లుక్కేయండి…

యాపిల్ ఐఫోన్ 14, రెడ్‌మి 12 సహా మరిన్నింటిపై భారీ తగ్గింపులను పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 విక్రయ సమయంలో రూ. 54,999 ఖర్చు అవుతుంది. ఐఫోన్ 14లో ఇదే అత్యల్ప తగ్గింపుగా చెప్పవచ్చు. ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా రూ. 57,999 ధర ట్యాగ్‌తో లిస్టు అయింది. దీని అసలు ధర రూ. 69,900 నుంచి తగ్గింది. ఈ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ 2023 ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా రూ.65,999కు ఇస్తుంది..

మోటోరోలా ఎడ్జ్ 40 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో సహా రూ. 25,499 ధరలో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ వాస్తవానికి రూ. 29,999కి లాంచ్ అయింది. వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను వద్దనుకుంటే.. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.26,299కి కొనుగోలు చేయొచ్చు.. అదే విధంగా రెడ్ మీ నుంచి 12 4జీని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ రూ. 9,999 నుంచి తగ్గి రూ.9,499కి తగ్గింది. పోకో ఎమ్6 ప్రో 5జీని రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు.. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.5,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 7ఎ మోడల్ రూ. 37,999కి కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లతో కూడా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, మోటో జీ54 5జీ మోడల్ వివో టీ2 ప్రో కూడా వరుసగా రూ. 13,999, రూ. 23,999 ధరకు కొనుగోలు చెయ్యొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు మొబైల్ ప్రియులకు ఈ ఆఫర్స్ పండుగే.. ఇక మీకు నచ్చిన ఫోన్ ను కోనేయ్యండి..

Exit mobile version