Site icon NTV Telugu

FlipKart: ఫ్లిప్‌కార్ట్‌కు భారీ జరిమానా.. అలాంటి కుక్కర్లు అమ్మినందుకు చీవాట్లు

Flipkart

Flipkart

FlipKart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది. సరైన నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను వినియోగదారులకు విక్రయించినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఫ్లిప్ కార్ట్‌ను కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ ఆదేశించింది. నాణ్యతలేని వస్తువులను విక్రయించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో నాసిరకం కుక్కర్లు విక్రయించారని దాఖలైన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో వినియోగదారులకు విక్రయించిన నాణ్యత లేని 598 కుక్కర్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఫ్లిప్‌కార్ట్‌ను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆదేశించింది. దీనికి సంబంధించి వెంటనే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. సదరు కుక్కర్లకు సంబంధించిన పూర్తి సొమ్మును రీఫండ్ చేయాలని సీసీపీఏ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై 45 రోజుల్లోగా కంప్లియన్స్ రిపోర్టును తమకు సమర్పించాలని ఆదేశించింది. అటు నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్ల విక్రయాలకు సంబంధించి సీసీపీఏ ఇటీవలే ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు కూడా జరిమానా విధించింది. వినియోగదారులకు సొమ్మును రీఫండ్ చేయాలని అమెజాన్‌ను కూడా ఆదేశించింది.

Read Also: National Anthem: జాతీయ గీతం పాడుతూ మధ్యలో మరిచిపోయిన ఎంపీ.. వైరల్ అవుతున్న వీడియో

అటు వినియోగదారులను ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యత ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని.. ఈ మేరకు ఉత్పత్తి కోసం ప్రామాణిక మార్కును ఉపయోగించాలని.. ప్రతి ఉత్పత్తికి తప్పనిసరి అనుగుణ్యతను నిర్దేశిస్తూ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్ తెలియజేస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, అన్ని దేశీయ ప్రెజర్ కుక్కర్‌లకు IS 2347:2017కి అనుగుణంగా ఉండాలి. కాబట్టి అన్ని ప్రెషర్ కుక్కర్‌లు IS 2347:2017కి అనుగుణంగా ఉండాలి. ప్రెజర్ కుక్కర్‌లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో విక్రయించినా ఈ మేరకు తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం.

Exit mobile version