NTV Telugu Site icon

Flipkart Big Saving Days sale: బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. 80 శాతం వరకు డిస్కౌంట్‌..!

Flipkart

Flipkart

పండుగల సీజన్‌, మరేదైనా ప్రత్యేకమైన రోజు.. ఇయర్‌ ఎండింగ్‌.. ఇలా ఈ-కామర్స్‌ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి.. వివిధ సందర్భాల్లో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్‌ ప్రత్యేక సేల్స్‌ నిర్వహిస్తూ వస్తుంది.. తాజాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలనులను ప్రకటించింది.. స్మార్ట్‌ఫోన్లు, వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ సహా అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభించే ఈ ప్రత్యేక సేల్‌ డిసెంబర్‌ 16న ప్రారంభం కాబోతోంది.. ఆరు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు అందించబోతోంది.. ఇక, ఈ ప్రత్యేక సేల్‌ డిసెంబర్‌ 21వ తేదీన ముగియబోతోంది.

Read Also: Chiranjeevi: వాల్తేరు వీరయ్య టీమ్ కు చిరు షాక్.. లిటిల్ సర్ప్రైజ్ అని సాంగ్ లీక్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఈ-కామర్స్ దిగ్గజం ఐఫోన్ 13పై ఆఫర్‌లు ఉంటాయా లేదా అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ ప్రతి సేల్ ఈవెంట్‌లో జనాదరణ పొందిన ఐఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోన్న విషయం విదితమే.. స్మార్ట్‌ఫోన్‌లపై అతిపెద్ద డీల్‌లను ఆఫర్ చేస్తుందని పేర్కొంది. ఇది మంచి తగ్గింపులు ఉండవచ్చని సూచిస్తుంది. వివిధ రకాల పరికరాలపై, అనేక ఎలక్ట్రానిక్స్‌పై డీల్స్ మరియు ఆఫర్‌లు కూడా ఉంటాయి. డిసెంబర్‌16న ప్రారంభమయ్యే ఈ సేల్‌ ఆరు రోజుల పాటు డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది. కాబట్టి కొనుగోలుదారులు నిర్ణయించుకోవడానికి చాలా సమయం ఉండనుంది.. ఇక, ఫ్లిప్‌కార్డ్‌ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఒక రోజు ముందుగానే సేల్ లైవ్ అవుతుంది, అంటే, అర్హత ఉన్న కస్టమర్లు డిసెంబర్ 15న సేల్‌ను యాక్సెస్ చేయగలుగుతారు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉండనుంది.. అయితే, ఇది మునుపటి సేల్స్‌తో పోలిస్తే చాలా తక్కువ.

ఈ-కామర్స్ దిగ్గజం ఐఫోన్ 13పై ఆఫర్‌లు ఉంటాయో లేదో ప్రత్యేకంగా చెప్పనప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ ప్రతి సేల్ ఈవెంట్‌లో జనాదరణ పొందిన ఐఫోన్‌లపై తగ్గింపులను అందిస్తూ వస్తోంది.. ఇటీవలే బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించింది.. ఆ సమయంలో ఐఫోన్‌ 13పై రూ. 4,000 వరకు తగ్గింపును అందించింది. గతంలో పండుగల సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఆఫర్లను అందుకోలేకపోయిన కస్టమర్లకు.. ఇది చక్కటి అవకాశం.. Realme, Apple, Vivo, Poco మరియు ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉండబోతున్నాయి.. టాబ్లెట్‌లు, మానిటర్లు, ప్రింటర్లు మరియు మరిన్నింటితో సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపును అందజేయనున్నారు.. టెలివిజన్‌లు మరియు ఉపకరణాలపై కూడా 75 శాతం వరకు తగ్గింపును చూడనున్నారు.. వివిధ ఉత్పత్తులపై సమయ-నిర్దిష్ట ఒప్పందాలు కూడా ఉండబోతున్నాయి.. డిసెంబర్ 15న డీల్‌లు మరియు ఆఫర్‌ల గురించి మరిన్ని వివరాలను వెల్లడించబోతోంది ఫ్లిప్‌కార్ట్.