ఎయిర్ ఇండియా సంస్థ ప్రైవేటీకరణ జనవరి 27 వ తేదీతో పూర్తయింది. జనవరి 27 వ తేదీన టాటా సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నది. టాటా ఆధీనంలోకి వెళ్లిన తరువాత ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మారుస్తామని టాటా సంస్థ ప్రకటించింది. టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లని తరువాత తమ విమానాల్లో ప్రయాణం చేస్తున్న వారికి టాటా గ్రూప్ చేసిన తొలి ఎనౌన్స్‌మెంట్‌ను మీడియాకు రిలీజ్ చేసింది. డియర్ గెస్ట్, నేను మీ కెప్టెన్‌ను మాట్లాడుతున్నాను.. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న విమానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వెల్‌కమ్‌టూ ది ఫ్యూచర్ ఆఫ్ ఎయిర్ ఇండియా వి హోప్‌యూ ఎంజాయ్ ది జర్నీ అని ఎనౌన్స్‌మెంట్ చేసింది.
Read: 100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత
1932లో టాటాలు నెలకొల్పిన టాటా ఎయిర్ సంస్థ ఆనంతర కాలంలో ఎయిర్ ఇండియాగా మారింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ సంస్థను కొనుగోలు చేసింది. కొంతకాలం బాగానే నడిచినప్పటికీ, ప్రైవేటు విమానయాన సంస్థలకు అవకాశం కల్పించడంతో క్రమంగా ఎయిర్ ఇండియా చిక్కులు వచ్చి పడ్డాయి. అప్పులు అయ్యాయి. కాగా, అప్పట్లో ఎవరి నుంచి ఎయిర్ ఇండియాను దక్కించుకున్నారో, ఇప్పుడు తిరిగి వారికే అప్పగించారు.
