Site icon NTV Telugu

Fact Check: ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలా? ఇది నిజమేనా?

Gst On House Rent

Gst On House Rent

Fact Check on house Rent GST: గత నెలలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించింది. దీంతో పాలు, పెరుగు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అయితే ఇంటి అద్దెపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. జీఎస్టీ కారణంగా ఇంటి అద్దెలు కూడా పెరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో సామాన్యుల జేబుకు మరింత చిల్లు పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంటి అద్దెపై ప్రతి ఒక్కరూ 18 శాతం జీఎస్టీ చెల్లించాలా అన్న సందేహాలపై ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చింది.

Read Also: Emirates Airlines Offer: ఫ్రీగా వస్తుందని ఈ లింక్ క్లిక్ చేస్తే.. మీ ఖాతాలు ఖాళీ..!!

ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న ప్రతి ఒక్కరూ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని.. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓ ఇంటిని వ్యాపార సంస్థ అద్దెకు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంటి అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. అంతే తప్ప ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చినప్పుడు లేదా వ్యక్తిగత అవసరాలకు ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు ఆ ఇంటి అద్దెపై ఎలాంటి జీఎస్టీ కట్టనక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఓ వ్యాపార సంస్థ యజమాని అయినా భాగస్వామి అయినా వ్యక్తిగత అవసరాల కోసం ఇంటిని అద్దెకు తీసుకుంటే జీఎస్టీ చెల్లించనవసరంలేదని వివరించింది. ఈ మేరకు సమాచార శాఖ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. దీంతో సాధారణ పౌరులు ఉండే ఇంటి అద్దెలపై ఎలాంటి ప్రభావం పడదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version