NTV Telugu Site icon

England Currency: ఇంగ్లండ్‌ కరెన్సీపై కొత్త రాజు ఫొటో రెండేళ్ల తర్వాతే!

England Currency

England Currency

England Currency: ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌-2 ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆ దేశానికి కొత్తగా రాజైన కింగ్‌ ఛార్లెస్‌-3 ఫొటోతో కూడిన కరెన్సీ నోట్లు 2024 మధ్య నుంచి చెలామణిలోకి వచ్చే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ తెలిపింది. ప్రస్తుతం వాడుతున్న పాలిమర్‌ నోట్లపై రాణి ఎలిజబెత్‌-2 ఫొటో1960 నుంచి కొనసాగుతోంది. ఆ నోట్లు మాసిపోయినప్పుడు లేదా డ్యామేజ్‌ అయినప్పుడు మాత్రమే సర్క్యులేషన్‌ నుంచి తొలగిస్తామని BOE వివరించింది. రాణి ఎలిజబెత్‌-2 ఫొటో ఉన్న పేపర్‌ నోట్ల చెల్లుబాటును ఈ నెలాఖరుతో నిలిపివేయనున్నారు.

పెరిగిన అమ్మకాలు, లాభాలు

దేశంలో పండగ సీజన్‌ ప్రారంభం కావటంతో కార్ల అమ్మకాలు పెరిగాయి. కార్ల తయారీ సంస్థల లాభాలు కొవిడ్‌ ముందు స్థితికి చేరుకున్నాయి. డిమాండ్‌కి తగ్గట్లుగా కార్లను సప్లై చేసేందుకు మారుతీ సంస్థ ఏకంగా 95 శాతం ప్రొడక్షన్‌ కెపాసిటీతో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల వాహన తయారీ సంస్థలకు పూర్వ వైభవం దాదాపుగా వచ్చినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాలు మొదలవటంతో పండగ సీజన్‌ ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24వ తేదీన దీపావళి పండగతో ముగుస్తుంది. కార్లు కావొచ్చు. ఇతర వస్తువులు కావొచ్చు. కొత్తవాటిని పండగ సమయంలో కొనాలనేది చాలా మంది కస్టమర్లకు ఒక రకంగా సెంటిమెంట్‌గా ఉంటోంది.

ESIC to expand: దేశవ్యాప్తంగా 750 జిల్లాలకు విస్తరించనున్న ‘ఈఎస్‌ఐసీ’

‘ఐసీఐసీఐ డైరెక్ట్‌’ ఫ్లాష్‌ట్రేడ్‌ లాంఛ్‌

ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్‌ ట్రేడర్స్‌ కోసం ఐసీఐసీఐ డైరెక్ట్‌.. ఫ్లాష్‌ట్రేడ్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను లాంఛ్‌ చేసింది. సింగిల్‌ స్క్రీన్‌ ట్రేడింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసమే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆర్డర్లు, పొజిషన్లు, చార్ట్‌లు, ప్రాఫిట్‌ మరియు లాస్‌ వంటి ఫీచర్లన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఇందులో టైమ్‌ బేస్డ్‌ ఎగ్జిట్‌ రూల్స్‌ని సెట్‌ చేసుకోవటం ద్వారా ట్రేడర్లు నష్టాలను తగ్గించుకోవచ్చని, తద్వారా లాభాలు పొందొచ్చని పేర్కొంది. దేశంలో డీమ్యాట్‌ అకౌంట్ల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న సమయంలోనే ఫ్లాష్‌ట్రేడ్‌ ప్లాట్‌ఫాం తెర మీదికి రావటం చెప్పుకోదగ్గ విషయం.