Site icon NTV Telugu

అమెజాన్ ఇండియా సీఈవోకు ఈడీ సమన్లు

అమెజాన్ ఇండియా సీఈవో అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య ఒప్పందంలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఉల్లంఘించారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అమెజాన్ సీఈవో అమిత్ అగర్వాల్ వచ్చే వారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది.

Read Also: ‘బిగ్‌బాస్‌’ నుంచి రవి ఎలిమినేట్.. అసలు ఏం జరిగింది?

2019లో అమెజాన్ కంపెనీ రూ.1400 కోట్ల ఒప్పందంతో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం అమలులో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలను అమెజాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే ఈడీ సమన్లకు సంబంధించి అమెజాన్ అధికార ప్రతినిధి స్పందించారు. సమన్లు ఇప్పుడే అందాయని… వాటిని పరిశీలించిన తర్వాత గడువులోపు స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version