NTV Telugu Site icon

Work from home: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లేదా..? అయితే ఇదిగో రాజీనామా..!

Work From Home

Work From Home

కరోనా మహమ్మారి ఒక్కసారిగా జీవన విధానాన్నే మార్చేసింది.. ఆఫీసు, కాలేజీ, స్కూలు, ఇలా ఎక్కడికి వెళ్లకుండా… అంతా ఇంట్లోనే ఉంటూ.. పని చేసుకునే విధంగా.. చదువుకునే విధంగా.. ఎన్నో మార్పులకు కారణమైంది.. వర్క్‌ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన ఎడ్యుకేషన్‌.. ఇలా కొత్త విధానాన్ని పరిచయం చేసింది.. అయితే, ఇప్పుడు అదే చాలా సమస్యలకు దారితీస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.. కరోనా నిబంధనలు పాటించాలన్న ఆదేశాలతో సుదీర్ఘ కాలంగా ఆయన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇంటికే పరిమితం చేశాయి.. అయితే, తిరిగి ఆఫీస్‌కు వచ్చేందుకు ఉద్యోగులు ఇష్టపడడం లేదని ఓ నివేదిక వెల్లడించింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోం విషయంలో వెయ్యి మంది ఉద్యోగులపై ఓ సర్వే నిర్వహించగా.. అందులో 39 శాతం మంది ఉద్యోగులు.. తమకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనుమతించకపోతే.. తాము చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధమని వెల్లడించారు.. ఇక, 1990 నుంచి 2010 మధ్య కాలంలో జన్మించిన ఉద్యోగుల్లో 49శాతం మందికి పైగా వర్క్‌ఫ్రమ్‌ హోం చేసే సామర్ధ్యం ఉందని, అలా చేయడం వల్ల వర్క్‌ ప్రొడక్టివిటీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రతిష్టాత్మక సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నందుకు ఇప్పటికే వందల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలేశారట.. ఈ వారమే యాపిల్‌ సంస్థ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దని, ఆఫీస్‌కు వచ్చి చేయాలన్న కారణంగా యాపిల్‌ సంస్థ ఏఐ డైరెక్టర్‌ ఇయాన్‌ గుడ్‌ఫెల్‌ రాజీనామా ప్రకటించగా.. కోడింగ్‌ స్టార్టప్‌ వైట్‌ హాట్‌ జూనియర్‌కు చెందిన 800మంది ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలకు వదిలేశారు.. దీంతో, కొన్ని సంస్థలు.. రిటర్న్‌ టూ ఆఫీస్‌కు బదులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నట్టు ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.