NTV Telugu Site icon

World Richest Person: ప్రపంచ కుబేరులు.. ఫస్ట్‌ ప్లేస్‌ కోల్పోయిన ఎలాన్‌ మస్క్.. వివరాలు ఇవిగో..

Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్‌ మస్క్‌.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..! ఇది నిజమే.. ఫోర్బ్స్ జాబితాలో ఆయన రెండో స్థానానికి దిగజారారు. టెస్లా షేర్లు భారీగా పతనం.. ట్విట్టర్‌ 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆయన సంపద తగ్గిపోయింది.. దీంతో సెకండ్‌ ప్లేస్‌కు వెళ్లిపోయారు.. దీంతో, ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా మొదటి స్థానానికి దూసుకొచ్చారు ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్.. కానీ, ఈ లెక్కలు కొన్ని క్షణాల్లోనే మారిపోయాయి.. వ్యక్తిగత సంపదను పెంచుకుని మస్క్ మళ్లీ టాప్‌స్పాట్‌కు చేరుకున్నారు.. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అర్నాల్ట్ సంపదవిలువ 184.7 బిలియన్ డాలర్లుగా ఉంటే.. మస్క్ సంపద 185.4 బిలియన్ డాలర్లుగా ఉంది.

Read Also: Amazon Layoff: 10 వేలు కాదు..20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్..

ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టిన 14 నెలల తర్వాత, టెస్లా మరియు ట్విట్టర్ చీఫ్ బుధవారం మొదటి స్థానాన్ని కోల్పోయారు ఎలాన్‌ మస్క్.. 7వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు బెర్నార్డ్ ఆర్నాల్ట్.. మస్క్‌ను అధిగమించాడు.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అయ్యాడు. అతని ఆస్తుల విలువ 184.7 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేయబడింది, మస్క్ 184.6 బిలియన్‌ డాలర్లు.. అంటే 100 మిలియన్‌ డాలర్లతో వెనుకబడి పోయాడు.. అయితే, అమెరికా మార్కెట్లు సాయంత్రం 4 గంటలకు ముగిసే సమయానికి అది మారిపోయింది.. మళ్లీ అగ్రస్థానాన్ని తిరిగి పొందారు మస్క్.. సెప్టెంబర్ 27, 2021న, ఎలాన్ మస్క్ అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్‌ను మొదటిసారిగా అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. “నేను జెఫ్రీ బి.కి ‘2’ అంకె యొక్క పెద్ద విగ్రహాన్ని, ఒక వెండి పతకాన్ని పంపుతున్నాను,” అని టెస్లా చీఫ్ ఆ రోజు వ్యాఖ్యానించాడు.. అయితే, 14 నెలల తర్వాత, బుధవారం రోజు మస్క్ మరోసారి రెండో స్థానానికి వెళ్లిపోయారు.. బుధవారం జరిగిన పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్రెంచ్ లగ్జరీ వస్తువుల సమ్మేళనం (LVMH)కి చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడిగా అవతరించారు.. 2021లో నం. 3 ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన బెజోస్‌తో ట్రేడింగ్ చేసిన తర్వాత, ఆర్నాల్ట్ 185.4 బిలియన్‌ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచారు.. ఉదయం 10 గంటల నుంచి దాదాపు 12:30 గంటల వరకు టాప్‌స్పాట్‌లో కొనసాగారు.. ఆ తర్వాత మస్క్ మళ్లీ మొదటి స్థానాన్ని తిరిగి పొందాడు. ఇక, అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ కొనసాగుతున్నారు.. జెఫ్ బెజోస్ నాల్గో స్థానంలో ఉండగా.. వారెన్ బఫెట్ ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన మరో బిజినెస్‌ మెన్‌ ముకేష్‌ అంబానీ ఈ జాబితాలో 8వ స్థానంలో కొనసాగుతున్నారు.

Show comments