NTV Telugu Site icon

Elon Musk: యూట్యూబ్‌పై మస్క్ కన్నుపడిందా?

Musk

Musk

ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోగా.. ట్విటర్‌ను కొనుగోలు చేసేకంటే ముందు మస్క్ ట్విటర్‌పై విమర్శల దాడికి దిగారు. క్రమక్రమంగా ట్విటర్‌ను కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎలన్ మస్క్ దృష్టి యూట్యూబ్‌పై పడినట్లు చర్చ జరుగుతుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. మస్క్ వరుస ట్వీట్లతో యూట్యూబ్‌పై విమర్శలు చేశారు. యూట్యూబ్ స్కామ్ యాడ్స్‌తో నిండిపోయిందని అంటూనే యూట్యూబ్‌లో స్కామ్ ప్రకటనలు ఉన్నాయనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం రెండు సార్లు వరుసగా ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్ల నేపథ్యంలో మస్క్ యూట్యూబ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు.

ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ముందు ఇలానే ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. వరుసగా ట్వీట్లు చేస్తూ హల్‌చల్ చేశాడు. చివరికి ట్విటర్‌ను చేజిక్కించుకునే వరకు వచ్చాడు. ప్రస్తుతం ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ వాయిదా పడడంతో మస్క్ కన్ను యూట్యూబ్‌పై పడినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మంగళవారం మస్క్‌ వరుసగా రెండు ట్వీట్లు చేశారు. యూట్యూబ్ స్కామ్ యాడ్స్‌తో నిండిపోయిందని చెప్పడానికి ఆయన వరుసగా రెండు ట్వీట్లు చేశారు.

RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్..

ఈ నేపథ్యంలో మస్క్‌ చూపు యూట్యూబ్‌పై పడిందని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అతని లక్ష్యం యూట్యూబే అని.. దానిని జోక్‌గా తీసుకోవద్దని అంటూ రీట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు మస్క్.. మీరు యూట్యూబ్‌ను కొనుగోలు చేయండి అంటూ సూచిస్తున్నారు. మరి మస్క్ ట్విటర్ యాజమాన్యంతో డీల్ వదిలేసి యూట్యూబ్ ను కొనుగోలు చేస్తాడా? మస్క్ ట్వీట్ల వెనుక ఆంతర్యం ఏమిటి అనేది తేలాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.