NTV Telugu Site icon

టెస్లా అధినేత‌కు షాక్.. రెండో స్థానం కూడా పోయింది..!

Elon Musk

Elon Musk

ప్ర‌పంచ కుభేరుల జాబితాలో తొలిస్థానంలో కొన‌సాగుతూ వ‌చ్చిన టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్.. ఆ మ‌ధ్యే.. తొలి స్థానాన్ని కోల్పోయారు… ఇప్పుడు టాప్ బిలియ‌న‌ర్ల జాబితాలో రెండో స్థానాన్ని సైతం కోల్పోయి.. థ‌ర్డ్ ప్లేస్‌కు వ‌చ్చా 49 ఏళ్ల ఎలాన్ మస్క్.. లూయీ వ్యూటన్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానానికి ఎగ‌బాకారు.. ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ త‌యారీ సంస్థ టెస్లా షేర్ల ధర సోమ‌వారం 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కార‌ణంగా చెబుతున్నారు.. గత మార్చిలో కొద్దిరోజుల పాటు మస్క్ నంబర్ వన్ స్థానంలో నిలిచినా.. ఆ త‌ర్వాత నంబ‌ర్ 2కి ప‌డిపోయారు.. ఇప్పుడు నంబ‌ర్ 2 కూడా పోయింది.. లగ్జరీ గూడ్స్ దిగ్గజం లూయీ వ్యూటన్ అమ్మకాలు భారీగా పెరుగడంతో ఆ సంస్థ చీఫ్ ఆర్నాల్ట్ నికర ఆస్తి విలువ 4700 కోట్ల డాలర్లు పెరిగి 161.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, ఇది మస్క్ సంపదన కన్నా కొంచెమే ఎక్కువ అయినా.. ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల్లో నంబర్ 2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక‌, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 190 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు… ఇటీవల, మస్క్ యొక్క ప్రకటనలు బిట్‌కాయిన్ విలువ తగ్గడానికి దారితీశాయి.. ఈ నెల 12న మస్క్ మాట్లాడుతూ.. టెస్లా ఇకపై కార్ల కొనుగోలు కోసం బిట్‌కాయిన్‌ను అంగీకరించదు అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.