దేశంలో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు తగ్గింపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో మరో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో నూనె ధరల తగ్గింపు అమలు కానుంది. పామాయిల్‌పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ.10 నుంచి 15 వరకు, సోయాబీన్‌పై రూ.5 తగ్గే అవకాశం ఉంది.
మే నెలలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. దీంతో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. భారత్ వినియోగించే వంట నూనెలో సగానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం దిగుమతి సుంకాలు తగ్గించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సన్‌ఫ్లవర్, సోయా, పామాయిల్ ధరలు తగ్గాయని ఇండియన్ వెజిటేబుల్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
SBI: గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. వాటిపై వడ్డీ రేట్లు పెంపు..
