కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై భారీగా పడింది.. వేలల్లో ఉద్యోగాలు పోతే.. ఉపాధి కూడా కరువైంది.. లాక్‌డౌన్‌లతో పట్టణాలను వదలి.. పల్లె బాట పట్టారు.. ఇవన్నీఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. అయితే, ఆర్థిక వ్యవస్థ రికవరీపై తాజాగా ఆర్బీఐ నెలవారీ నివేదిక విడుదల చేసింది.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంపైనే ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆధారపడి ఉందని ఆర్బీఐ పేర్కొంది.. ఇక, కరోనా మహమ్మారి నుంచి బయటపడి ముందుకువెళ్లే సత్తా మన ఆర్థిక వ్యవస్థకు ఉందని ఆర్బీఐ నివేదిక చెబుతోంది.. అయితే, మహమ్మారి ప్రభావాలను తట్టుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపింది.. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం.. ప్రధానంగా దేశీయ డిమాండ్ ను దెబ్బతీసిందని.. కానీ, వ్యవసాయ దిగుబడుల సరఫరాలు, సేవల రంగం ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉన్నట్టు పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థ రికవరీ అది ఒక్కటే మార్గం-ఆర్బీఐ
RBI