NTV Telugu Site icon

E-Ticket vs I-Ticket: ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్ అంటే ఏంటి?.. ఈ 2 టిక్కెట్ల మధ్య తేడా, ప్రయోజనాలు ఇవే!

E Ticket Vs I Ticket

E Ticket Vs I Ticket

Difference Between E Ticket and I Ticket: ప్రస్తుత రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూ ఉండడంతో.. ఎక్కువ మంది ముందే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఇవి ఈ-టిక్కెట్ లేదా ఐ-టికెట్ రూపంలో ఉంటాయి. అయితే చాలా మందికి ఈ-టికెట్, ఐ-టికెట్ అంటే ఏంటి?.. వాటి మధ్య తేడా ఏంటి? అనే విషయంలో పెద్ద గందరగోళం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇ-ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్ అంటే ఎంటో ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ రైల్వేలలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి ఈ-టిక్కెట్ లేదా ఐ-టిక్కెట్ రూపంలో ఉంటాయి. సాధారణంగా ఈ-టిక్కెట్ అనేది ప్రింటెడ్ టికెట్. ఐ-టిక్కెట్ అంటే భారతీయ రైల్వే తరపున ప్రయాణీకులకు కొరియర్ చేయబడుతుంది.

ఈ-టిక్కెట్ అంటే:
ఈ-టిక్కెట్ అంటే ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ టికెట్. ప్రయాణీకులు ఈ టిక్కెట్టును వారి సౌలభ్యం ప్రకారం ముద్రించవచ్చు. ఈ-టికెట్లు రైల్వే కౌంటర్‌లో కాకుండా ఇంటి నుంచి లేదా ఏదైనా కంప్యూటర్ కేఫ్ నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేయబడతాయి. దీని చెల్లుబాటు రైల్వే బుకింగ్ కౌంటర్ నుంచి జారీ చేయబడిన టిక్కెట్టుకు సమానంగా ఉంటుంది.ఈ-టిక్కెట్ ద్వారా ప్రయాణించే ప్రయాణికులు తమ వద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు)ను తప్పనిసరిగా ఉంచుకోవాలి.

Also Read: PM Modi: మధ్యప్రదేశ్‌లో 5 కొత్త వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

ఐ-టిక్కెట్ అంటే:
ఐ-టిక్కెట్ భారతీయ రైల్వే తరపున ప్రయాణీకుల చిరునామాకు కొరియర్ చేయబడుతుంది. అయితే ఈ టికెట్ ఇంటర్నెట్ ద్వారా కూడా బుక్ చేయబడినప్పటికీ.. దానిని ముద్రించలేం. ఇది ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఇచ్చిన చిరునామాకు రైల్వే శాఖ కొరియర్ ద్వారా పంపబడుతుంది. ఈ టికెట్ ప్రయాణీకుడికి చేరుకోవడానికి కనీసం 48 గంటల సమయం పడుతుంది. ప్రయాణానికి రెండు రోజుల ముందు ఐ-టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. టికెట్వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండాలి.

ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్ మధ్య వ్యత్యాసం:
ఐ-టిక్కెట్ల కంటే ఈ-టిక్కెట్ చౌకగా ఉంటాయి. కొరియర్ ఖర్చు కవర్ చేయడానికి ఐ-టిక్కెట్‌లో డెలివరీ ఛార్జీ ఉంటుంది. అదే రోజున ఈ-టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు కానీ.. ఐ-టికెట్లను రెండు రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ-టికెట్ల రద్దు సులభం. ఆన్‌లైన్‌లో మాత్రమే వీటిని రద్దు చేసుకోవచ్చు. ఐ-టిక్కెట్లను ఆన్‌లైన్‌లో రద్దు చేయలేం. రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కి వెళ్లి.. ఫారమ్‌ను నింపాలి. ఇ-టికెట్లలో సీటు, బెర్త్ నిర్ధారణ అవుతుంది. లేదా ఆర్ఏసీ బుక్ చేయబడుతుంది. ఆర్ఏసీ లేదా వెయిటింగ్‌ని ఐ-టిక్కెట్‌లోని మూడు విభాగాలలో టికెట్ బుక్కింగ్ చేసుకోవచ్చు.

Also Read: Traffic Rules Challan: డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!

Show comments