Donald Trump tariffs India-China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు పిచ్చి పీక్స్‌కు చేరుకుంది. అదేంటి ఒక్కసారిగా అలా అన్నారు? అని ఆశ్చర్య పోకండి. ఈ వార్త చదివిన తరువాత మొత్తం మీకే అర్థమవుతుంది. వాస్తవానికి అమెరికాకు చైనా అంటే ముందు నుంచే పడదు. చైనా పేరు వింటేనే ఎక్కడో కాలుతుంది. మరోవైపు.. భారత్ అమెరికాకు మిత్ర దేశం. ఇరు దేశాల మధ్య మంచి సఖ్యత ఉంది. కానీ.. ఈ రెండు దేశాలపై ట్రంప్ మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. భారత్‌పై 50% శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో ఈ అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. మిత్ర దేశం అంటూనే వెన్నుపోటు పొడిచారు ట్రంప్.. రష్యా నుంచి చమురు దిగుమతి కారణంగా సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.
READ MORE: Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
కానీ.. శత్రు దేశం చైనా పై మాత్ర దయ చూపుతున్నారు. చైనాపై అదనపు సుంకం విధించే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల పాటు వాయిదా వేశారు. అమెరికా-చైనా సుంకాల గడువును నవంబర్ 9 వరకు పొడిగించినట్లు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకం విధించింది. ఏప్రిల్‌లో చైనాపై 245 శాతం వరకు సుంకం విధిస్తామని అమెరికా బెదిరించింది. దీనికి చైనా స్పందిస్తూ అమెరికాపై 125 శాతం సుంకం విధిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా పట్ల దయ చూపింది. అయితే చైనాతో అమెరికా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు విధించిన సుంకాల విషయంలో అగ్ర రాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్పష్టం చేశారు.
ఇంకో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే.. రష్యా నుంచి భారత్ అధికంగా చమురును కొనుగోలు చేస్తుందని ట్రంప్ వాదించారు. అయితే.. డిసెంబర్ 2022, జూలై 2025 మధ్య రష్యన్ చమురును చైనా (47%), భారతదేశం (38%), EU దేశాలు + టర్కీ (6%) చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. చైనా అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. భారత్ మాత్రమే అత్యధికంగా కొనుగోలు చేస్తోందనే ట్రంప్ వాదన పూర్తిగా తప్పు. భారత్ పరిమితుల్లో వ్యాపారం చేస్తోంది.. కానీ ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద కపటత్వం ఎందుకు..? లేనిది ఉన్నట్లుగా ఎందుకు కల్పిస్తున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమువుతున్నాయి. వాస్తవానికి, ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న దేశాలు భారత్‌ను ఇష్టపడవు. ఎందుకంటే.. భారత్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందని భయం. అందుకే ఇతర దేశాలు నిశ్శబ్దంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పటికీ.. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న భారత్‌ను మాత్రమే నిందిస్తున్నారు. ఇది నైతికతకు సంబంధించిన విషయం కాదని.. రాజకీయంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే ట్రంప్‌కు పిచ్చి పీక్స్‌కు చేరింది అనిపిస్తోంది కదూ..!
