NTV Telugu Site icon

DMart Q2 Results: డీమార్ట్‌కు భారీ లాభాలు.. ఎంత ఆదాయం వచ్చిందంటే..!

Dmart

Dmart

దేశవ్యాప్తంగా డీమార్ట్‌ పేరిట సూపర్‌ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్‌ చైన్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో రూ.710.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.658.54 కోట్లతో పోలిస్తే లాభంలో 8శాతం వృద్ధిచెందింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కార్యకాలపాల నుంచి వచ్చే ఆదాయం రూ.14,050.32 కోట్లకు చేరింది.

ఇది కూడా చదవండి: Home Minister Anita: అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..

గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.12,307.72 కోట్లతో పోలిస్తే 14శాతం పెరిగింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ లాభం 5.6శాతం పెరిగి రూ.659 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో డీమార్ట్‌ ఎబిటా 10.3 శాతం పెరిగి రూ.1,105 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కొత్తగా ఆరు స్టోర్‌లను జోడించింది.

ఇది కూడా చదవండి: RSS Chief: ‘‘డీప్ స్టేట్, గాజా, బంగ్లాదేశ్, హమాస్’’.. దసరా స్పీచ్‌లో మోహన్ భగవత్ కీలక కామెంట్స్..

Show comments