Dell Layoffs: టెక్ పరిశ్రమలో గత రెండేళ్ల నుంచి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడం, సంస్థల పునర్నిర్మాణంలో భాగంగా తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు టెక్ కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటివి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Read Also: Sheikh Hasina: హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ముందే హెచ్చరించిన భారత్!
తాజాగా మరో టెక్ దిగ్గజం డెల్ కూడా తన ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 12,500 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించబోతోంది. ఇది ఆ కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్సులో దాదాపుగా 10 శాతం ఉద్యోగులు ప్రభావితం కాబోతున్నారు. తన కొత్త AI-ఫోకస్డ్ యూనిట్ కోసం పునర్నిర్మాణ ప్రణాళికను అమలు చేయడం కోసం ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Israel: ఇజ్రాయిల్‌పై విరుచుకుపడుతున్న హిజ్బుల్లా.. డ్రోన్లతో దాడి..
డెల్ ఉద్యోగుల తొలగింపు రేపటి నుంచి ప్రారంభమవుతాయని, ఈ వారం వరకు కొనసాగొచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కంపెనీ గత ఏడాది నుంచి దాదాపు 13,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. తాజా లేఆఫ్స్ రెండోసారి. ఇంటెల్ తమ సంస్థలో పనిచేస్తున్న 15,000 మందిని తొలగించిన తర్వాత వచ్చిన తాజా లేఆఫ్ డెల్ సంస్థదే.