పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం గడువును ఇప్పటికే పలు దపాలుగా పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఆ గడువును పొడిగిస్తూ ప్రకటన చేసింది.. గతంలో ప్రకటించిన ప్రకారం ఈ నెల 30వ తేదీతో గడువు మిగిసిపోనుండగా… ఆ తేదీని సెప్టెంబర్ 30వ వరకు పొడిగించారు.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మరోవైపు వివాద్ సే విశ్వాస్ పథకం గడువును ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది కేంద్రం… ఫారం-16 గడువును జూలై 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఆధార్- పాన్ కార్డు లింక్ ఎంతో కీలకమైనది.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరో మూడు నెలలు వెసులుబాటు దొరికింది..
మరోసారి పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు..

Aadhaar PAN