Site icon NTV Telugu

OLA Bikes : వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌..

Ola

Ola

ఇండియన్‌ మార్కెట్‌పై అతి తక్కువ కాలంలోనే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చెరగని ముద్ర వేసింది. ఈ స్కూటర్‌ కోసం ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లు ఉన్నాయి . డెలివరీ, సర్వీసు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మొత్తంగా ఓలా స్కూటర్‌కి క్రేజ్‌ అయితే తగ్గలేదు. కాగా తమ కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ ప్రకటించారు ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. భారీ ఎత్తున ఇక్కడ స్కూటర్లు తయారు చేస్తుంటారు.

తమ కస్టమర్లు స్కూటర్లు ఎలా తయరవుతున్నాయో నేరుగా చూసే అవకాశం కల్పించనున్నట్లు భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 2020 జూన్‌ 19 ఆదివారం ఓలా ఫ్యాక్టరీలో ఈవెంట్‌ను నిర్వహిస్తుమని ఆయన పేర్కొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన వెయ్యి మంది కస్టమర్లను పిలవాలని నిర్ణయించినట్లు భవీశ్‌ అగర్వాల్‌ పేర్కన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్యపై పరిమితి ఎత్తేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు యాభై వేల మందికి పైగా డెలివరీ అయ్యాయన్న భవీశ్‌ అగర్వాల్.. వీరందరూ ఈవెంట్‌కు రావొచ్చంటూ ట్విటర్‌లో వెల్లడించారు.

Exit mobile version