రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట నూనె దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉంది.
Read Also: మగువలకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు
భారత్ దిగుమతి చేసుకుంటున్న పామాయిల్‌లో 60 శాతం వాటా ఇండోనేషియాదే ఉంటుంది. అయితే ఇండోనేషియా నుంచి దిగుమతులు తగ్గినా కూడా ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవాలని ఇడిబుల్ ఆయిల్ పరిశ్రమ భావిస్తోంది. ఇక మలేషియా నుంచి ఎడిబుల్ ఆయిల్ దిగుమతులను పెంచుకోవాలని భావిస్తోంది. అయితే తగినంత పామాయిల్‌ను మలేషియా నుంచి దిగుమతి చేసుకోవడం కష్టమైన పని అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వంటనూనెల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
