NTV Telugu Site icon

LPG cylinder: వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే..!

Lpg

Lpg

దసరా పండుగ వేళ వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1న భారీగా ధర పెంచింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.48కి పెంచింది. పెంచిన ధరలు మంగళవారం (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: Central Government: 14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

ఇదిలా ఉంటే గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే అక్టోబర్ 1న సవరించిన ధరలను ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: PM Modi: పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్..

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి. 5-కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్‌ల ధర రూ.12 పెంచబడింది.

ఇది కూడా చదవండి: New Liquor Policy: 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం..

Show comments