Gas Cylinder: బాదుడే బాదుడు.. రూ.250 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సామాన్యుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండగా.. తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలనే పెంచాయి. ఈ మేరకు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. హైదరాబాద్‌లో అయితే ఈ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460కి పెరిగింది. ఈ పెంపు ఈరోజు నుంచే అమల్లోకి రానుంది.
మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 10 రోజుల కిందటే డొమెస్టిక్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు పెంచాయి. ఈ కారణంగానే ఇప్పుడు ధరలో ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది. కాగా కమర్షియల్ సిలిండర్ రేట్లు పెరగడంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, మెస్‌లలో రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అంటూ సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..