దేశ వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1797 నుంచి 1803కి చేరింది. అయితే ఆగస్టు 2024 నుంచి 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. పెరిగిన ధరలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. గత ఫిబ్రవరి నెలలో చమురు మార్కెట్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును రూ.7 తగ్గించాయి.
మార్చి 1 నుంచి పెరిగిన ధరలతో ఇలా..
ఢిల్లీ: రూ. 1,803
ముంబై: రూ. 1,755
కోల్‌కతా: రూ. 1,913
చెన్నై: రూ. 1,965
హైదరాబాద్: రూ.2,023