ఈరోజు (గురువారం) CMR టెక్స్‌టైల్స్ మరియు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 33వ CMR షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ సంస్థ మాల్స్.. ఇప్పుడు ఒడిశాకు కూడా చేరింది. ఒడిశాలోని బెర్హంపూర్‌లో తన మొట్టమొదటి మాల్‌ను గ్రాండ్గా లాంఛ్ చేసింది. CMR షాపింగ్ మాల్ అంటేనే.. బ్రాండ్‌కు గణనీయమైన విస్తరణను సూచిస్తుంది. సీఎంఆర్ షాపింగ్ మాల్ 40 సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాల్స్ ను కలిగి ఉంది. ఏపీ, తెలంగాణా అంతటా కలిసి 32 స్టోర్‌లను నిర్వహిస్తోంది.
కామపల్లి జంక్షన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. బెర్హంపూర్ ఎమ్మెల్యే కె. అనిల్ కుమార్, గోపాల్‌పూర్ ఎమ్మెల్యే బిభూతి భూషణ్ జెనా ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రారంభోత్సవం తరువాత.. ప్రఖ్యాత ఆలీవుడ్ నటీమణులు భూమికా డాష్, శివాని సంగీత ప్రత్యేకంగా నిలిచి, అక్కడికి వచ్చిన వారిని సంతోషపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒడిషాలో ఈ ఐకానిక్ బ్రాండ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
Telangana DSC 2024: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
CMR షాపింగ్ మాల్ బెర్హంపూర్‌లోని ప్రజలకు అందుబాటులో ఉండనుంది. విభిన్నమైన రుచులు, శైలులకు అనుగుణంగా అనేక రకాల వస్త్రాలను అందించనుంది. CMR టెక్స్‌టైల్స్ మరియు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. దాని నాణ్యమైన ఉత్పత్తులు, అసాధారణమైన కస్టమర్ సేవకు ప్రసిద్ధి చెందింది. బెర్హంపూర్ ప్రజలకు ప్రీమియర్ షాపింగ్ అనుభవాన్ని అందించడం సీఎంఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. CMRలో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుంది. ప్రజలు తమకు కావాల్సిన అన్ని రకాల వేడుకలకు CMR తగు విధంగా కుటుంబం మొత్తానికి నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించడం CMR ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎంతో గుర్తింపు పొందిన సీఎంఆర్ షాపింగ్ మాల్.. ఇప్పుడు ఒరిస్సాలోని బెర్హంపూర్ లో స్టోర్ ను స్థాపించింది. దుకాణదారులు ఇప్పుడు ఆధునిక, విశాలమైన సెట్టింగ్‌లో తాజా ఫ్యాషన్ ట్రెండ్‌లను ఆస్వాదించవచ్చు. ఒడిశాలోని బెర్హంపూర్‌లో CMR షాపింగ్ మాల్ ప్రారంభం.. బ్రాండ్ ప్రయాణంలో మరో మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో.. CMR టెక్స్‌టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, శ్రీ మావూరి వెంకట రమణ.. జనరల్ మేనేజర్ శ్రీ నులు లింగమూర్తి, మోహన్ బాలాజీ మావూరి, హారిక మావూరి, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.