Site icon NTV Telugu

Chinese Loan Apps: స్విఛ్.. చైనాలో. సెర్చ్.. ఇండియాలో. హైదరాబాద్ సహా 16 చోట్ల ఈడీ దాడులు

Chinese Loan Apps

Chinese Loan Apps

Chinese Loan Apps: హైదరాబాద్‌ సహా దేశంలోని 16 చోట్ల చైనా లోన్‌ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు జరిపింది. బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పుణె, గురుగ్రామ్‌ తదితర నగరాల్లో నిర్వహించిన సోదాల్లో 46 కోట్ల రూపాయలను సీజ్‌ చేసింది. హెచ్‌పీజెడ్‌ టోకెన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెట్టి బిట్‌కాయిన్‌తోపాటు ఇతర క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ కేటుగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రైడ్స్‌ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌ని లిల్లియన్‌ టెక్నోక్యాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు షిగూ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. చైనీయులు నియంత్రిస్తున్న మరిన్ని బిజినెస్‌లతో షిగూ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించారు.

ఫోక్స్‌వ్యాగన్‌కి ప్రాఫిట్స్‌!

జర్మనీలోని కార్ల తయారీ రంగంలో పేరొందిన సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కి యూరప్‌లోని ఇంధన సంక్షోభం భారీగా కలిసిరానుంది. 400 మిలియన్‌ డాలర్ల ట్రేడింగ్‌ ప్రాఫిట్స్‌ని ఆర్జించి పెట్టనుంది. యూరోపియన్‌ ఎనర్జీ మార్కెట్లలో గ్యాస్‌ సప్లైకి ఊతమిచ్చేందుకు ఈ కంపెనీ 2.6 టెరావాట్‌-అవర్స్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌లను విక్రయిస్తోంది. యూరప్‌లో ఇంధన సంక్షోభం మూలంగా గ్యాస్‌ రేట్లు ఆకాశాన్నంటడంతో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఫోక్స్‌వ్యాగన్‌కి ప్లస్‌ అవుతోంది.

read also: Local Languages in PSBs: లోకల్‌ లాంగ్వేజ్‌లు మాట్లాడలేనివారిని పక్కన పెట్టండి. నిర్మలా సీతారామన్‌ సూచన

‘విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌’ తగ్గింపు

గ్లోబల్‌ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్లు తగ్గటంతో దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డీజిల్ మరియు జెట్ ఫ్యూయెల్‌ ఎగుమతులపై విధిస్తున్న లెవీకి కూడా కోత పెట్టింది. దేశీయంగా ఉత్పత్తయ్యే టన్ను క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ని 13,300 రూపాయల నుంచి 10,500 రూపాయలకి కుదించింది. లీటర్‌ డీజిల్‌ ఎగుమతిపై లెవీని రూ.13.5 నుంచి రూ.10కి తెచ్చింది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ ఎక్స్‌పోర్ట్‌లపై సుంకాన్ని రూ.9 నుంచి రూ.5 కి తగ్గించింది.

Exit mobile version