NTV Telugu Site icon

Loan on Aadhaar Card: అర్జెంటుగా డబ్బులు కావాలా?.. ఆధార్ కార్డుతో ఐదు లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్!

Aadhaar Card

Aadhaar Card

ఒక్కోసారి ఉన్నట్టుండి డబ్బులు అవసరం పడుతుంటాయి. సమయానికి చేతిలో నగదు ఉండదు. అలాంటి సమయంలో ఫ్రెండ్స్, తెలిసిన వారి వద్ద డబ్బులు అడుగుతుంటారు. అప్పులు చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. కానీ కావాల్సిన టైమ్ కు డబ్బు చేతికి అందదు. అప్పుడే ఈజీగా డబ్బు చేతికందే మార్గం ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు, మరి మీకు కూడా అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయా? సులభంగా రూ. 5 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. జస్ట్ మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే చాలు. ఏంటి ఆధార్ తో లోన్ కూడా ఇస్తున్నారా? అని ఆలోచిస్తున్నారా? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు పర్సనల్ లోన్స్ ను అందిస్తున్నాయి.

గ్యారంటీ, ష్యూరిటీ లేకుండానే రుణాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఆధార్ లో మీ వ్యక్తిగత వివరాలు అన్నీ ఉంటాయి. ఇతర డాక్యుమెంట్స్ తో పనిలేకుండా ఆధార్ పై లోన్స్ మంజూరు చేస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారానే అప్లై చేసుకుని లోన్ పొందొచ్చు. బ్యాంకుల వెబ్ సైట్స్, యాప్ ల ద్వారా పర్సనల్ లోన్స్ కు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 58 ఏళ్ల వయసున్న వారికి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు లోన్స్ ఇస్తాయి. ఉద్యోగులకు, స్థిర ఆదాయం పొందుతున్న వారికి బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు లోన్స్ అందిస్తుంటాయి. రూ. 50 వేల నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఆధార్‌తో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. ఎన్ఎఫ్ బీలు రూ. 25 వేల నుంచి కూడా లోన్స్ మంజూరు చేస్తున్నాయి. లోన్ చెల్లించేందుకు మీకు ఐదేళ్ల వరకు అనుకూలమైన టెన్యూర్ ను ఎంచుకోవచ్చు.

పర్సనల్ లోన్ కావాలనుకునే వారు ఆధార్ ద్వారా లోన్స్ అందిస్తున్న బ్యాంకులు, లేదా ఎన్ బీఎఫ్ సీ వెబ్ సైట్ లను సందర్శించాలి. అక్కడ లోన్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలి. అర్హత ఉన్నట్లైతే అవసరమైనపత్రాలను అప్ లోడ్ చేయాలి. దీని తర్వాత ఆధార్ ఓటీపీతో కేవైసీ పూర్తి చేయాలి. అన్ని పత్రాలను అప్ లోడ్ చేసి సబ్మిట్ చేశాక రెండు రోజుల వ్యవధిలో లోన్ మంజూరు అవుతుంది. అకౌంట్ లోనే నగదు జమ అవుతుంది. అయితే ఆన్ లైన్ లో లోన్స్ తీసుకునేటపుడు పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. డిజిటల్ ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.