కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ పేర్కొంది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్‌లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్‌లైన్ అడ్వటైజ్మెంట్ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌తో ఇండియన్ యూజర్లను టార్గెట్ చేయడం నిలిపివేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్‌ఐఎఫ్‌ఎస్) ప్రకారం..38శాతం వార్షిక వృద్ధితో 2025నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ రూ.1.5లక్షల కోట్లుగా ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కేంద్రం తాజా నిర్ణయం త్వరలో పూర్తి స్థాయిలో అమలు కానుంది.
