Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపర్చే వార్త వెలువడింది. వాళ్ల వేతనాల సవరణకు సంబంధించి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమవద్ద లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో ఏర్పాటుచేయగా ఆ సంఘం సిఫార్సులు 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 8వ వేతన సంఘాన్ని గనక ఏర్పాటుచేస్తే ఆ సంఘం సిఫార్సులు 2026 జనవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
తగ్గిన లాభం
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నికర లాభం 37 శాతం తగ్గింది. జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ 3,801 కోట్ల రూపాయలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయంలో పవర్ గ్రిడ్ నికర లాభం 5,998 కోట్ల రూపాయలు వచ్చింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా ఈ సంస్థ నికర లాభం ఎనిమిదిన్నర శాతం పడిపోయి 4,156 కోట్ల రూపాయలకు తగ్గింది.
TS Constable Prelims Exam: కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌పరీక్ష వాయిదా.. ఎప్పుడంటే?
భరోసా ఇవ్వండి
అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను డాలర్లకు బదులు రూపాయల్లో జరపాలన్న వ్యవహారంపై పెద్ద బ్యాంకులు ఆర్బీఐ నుంచి స్పష్టతను మరియు భరోసాను కోరాయి. ఈ కొత్త ప్రక్రియను ప్రారంభించటం వల్ల పశ్చిమ దేశాలు తమపై ఆర్థిక ఆంక్షలను అమలుచేయబోవనే హామీ ఇవ్వాలని అడిగాయి. ముఖ్యంగా విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి.
32% దాటట్లే
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు సరైన వాటా దక్కట్లేదు. 41% వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం రికమండ్ చేయగా గత ఐదేళ్లలో ఒక్క ఏడాది తప్ప మిగతా నాలుగేళ్లూ 32 శాతానికి మించి ఇవ్వలేదు. ఇదే విషయాన్ని కొందరు ముఖ్యమంత్రులు మొన్నటి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. 2019-20లో మాత్రం 37 శాతం వరకు ఇచ్చారు.
ఫైజర్ డీల్
సికిల్ సెల్ వ్యాధికి మందును తయారుచేసే గ్లోబల్ బ్లడ్ థెరాప్యుటిక్స్ అనే సంస్థను ఫైజర్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 5.4 బిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేందుకు ఫైజర్ అంగీకరించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ మరియు ట్రీట్మెంట్ ద్వారా ఆదాయం పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఆ సంస్థను సొంతం చేసుకుంది.
మోటో జి32
మోటోరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇవాళ ఇండియా మార్కెట్‌లోకి రానుంది. కొన్ని నెలల కిందట మోటో జి22 అనే మోడల్‌ని విడుదల చేసిన ఆ సంస్థ ఇప్పుడు జీ32 అనే మోడల్‌ని తీసుకొస్తోంది. జీ సిరీస్‌లో ఇది 6వ హ్యాండ్‌సెట్ అని పేర్కొంది. ఈ లేటెస్ట్ మోడల్ రేటు సుమారు 17 వేల రూపాయల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
