ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ పోతోంది.. ఇక, కొన్ని బ్యాంకులను విలీనం చేస్తూ ముందుకు సాగుతోంది.. దీంతో.. భవిష్యత్ ఉద్యోగుల తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు లేకపోలేదు.. మరోవైపు.. మరో రెండు బ్యాంకులను ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర సర్కార్.. దానాకి అడ్డంకులు లేకుండా.. వచ్చే వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ బ్యాంకింగ్ లా చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాలని భావిస్తోంది.. ఈ సారి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను ప్రైవేటీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి… ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు గత బడ్జెట్‌లోనే పేర్కొన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కాగా, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కొత్త ప్రభుత్వ రంగ సంస్థల విధానం ప్రకారం ప్రైవేటీకరణ, విలీనం చేయాల్సిన సంస్థల వివరాలను నీతి ఆయోగ్ సిఫార్సు చేయనుంది. ఈసారికి మాత్రం పై రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాల్సిందిగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ బ్యాంకులు కూడా ప్రైవేటీకరణ..! రంగం సిద్ధం..

IOB