CarryMen: ‘మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం’.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CarryMen: ఢిల్లీ మార్కెట్లలో ఎప్పుడైనా షాపింగ్ చేశారా? అయితే అక్కడ ఉండే తిప్పలు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక చేత్తో మూడు షాపింగ్ బ్యాగులు, మరో చేత్తో తినుబండారాల ప్యాకెట్లు.. ఈ లోపు జేబులోంచి ఫోన్ జారిపోతుంటుంది. ఉక్కపోత, విపరీతమైన జనం.. ప్రతి రెండు సెకన్లకూ “భయ్యా సైడ్ ప్లీజ్!” అంటూ ఎవరో ఒకరు అరుస్తూనే ఉంటారు. ఇలా లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్ లేదా చాంద్నీ చౌక్.. ఏదైనా కావచ్చు, ఢిల్లీలోని ఐకానిక్ మార్కెట్లలో షాపింగ్ చేయడం ఎంత సరదాగా ఉంటుందో, అంతే అలసటను ఇస్తుంది. అయితే, ఇప్పుడు ఈ అలసటను దూరం చేయడానికి ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఇది అలసిపోయే భర్తలకు, విసుక్కునే బాయ్‌ఫ్రెండ్స్‌కు, ఓపిక నశించే తల్లులకు ఒక పెద్ద ఊరట కానుంది.
ఆ సర్వీస్ ఏది అని ఆలోచిస్తున్నారా? అదే నండి కొత్తగా స్టార్ట్ అయిన “క్యారీమెన్” (CarryMen) షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్. వీరి కాన్సెప్ట్ సింపుల్.. “మీరు షాపింగ్ చేయండి.. మీ బ్యాగులు మేము మోస్తాం” అని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు స్థానిక యువకులకు తాము చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతో మార్కెట్లకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాల నుంచే ఈ ఆలోచన వచ్చిందట. బ్యాగుల బరువు మోస్తూ, కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ, ఫుడ్ కౌంటర్ల దగ్గర క్యూలో నిల్చోవడంతో షాపింగ్ ఇచ్చే కిక్ కాస్తా పోయి తీవ్ర శారీరక అలసట మిగులుతోందని వారు గ్రహించారట. “ప్రజలకు షాపింగ్ అంటే ఇష్టం, కానీ దాంతో వచ్చే ఫిజికల్ స్ట్రెస్ అంటేనే నచ్చదు. కిక్కిరిసిన మార్కెట్లో చేతిలో పది బ్యాగులు పట్టుకుని మోమోస్ తినడానికి ఇబ్బంది పడకుండా, షాపింగ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నదే మా ఉద్దేశం” అని స్టార్టప్ ప్రతినిధి తెలిపారు.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
ఈ తిప్పలు పోగొట్టడనికి గంటకు కేవలం రూ. 149 చొప్పున (2, 3 లేదా 4 గంటల ప్యాకేజీల ఆప్షన్లతో) ఒక శిక్షణ పొందిన అసిస్టెంట్ మీకు తోడుగా వస్తాడు. ఈ అసిస్టెంట్ మీ షాపింగ్ బ్యాగులను మోయడం, షాపుల అడ్రస్సులు చెప్పడం, ఫుడ్ కౌంటర్ల దగ్గర మీ కోసం క్యూలో నిలబడడం, మిమ్మల్ని పార్కింగ్ ఏరియా లేదా మెట్రో గేట్ల వరకు సాగనంపడం.. ఇలా అన్నీ చూసుకుంటాడు. దీనివల్ల కస్టమర్ల చేతిలు ఖాళీగా ఉంటాయి. ఇక హాయిగా మార్కెట్లో తిరగొచ్చు. ఈ సర్వీస్ ముఖ్యంగా కొంతమందికి వరంగా మారనుంది. ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు మార్కెట్లలో అంత బరువులు మోస్తూ తిరగడం చాలా కష్టం. ఒక కస్టమర్ అయితే కేవలం ఈ ఇబ్బంది వల్లే ఈ సర్వీస్ బుక్ చేసుకున్నారు. ఇక చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రుల కష్టాలు వర్ణనాతీతం. ఒక చేత్తో స్ట్రోలర్ (పిల్లల బండి), మరో చేత్తో బ్యాగులు పట్టుకోవాలి.. సరిగ్గా అదే టైమ్‌లో చాట్ కౌంటర్ దగ్గర పిల్లలు ఏడవడం మొదలుపెడతారు. అలాంటి వాళ్లకు ఇది బాగా పని చేస్తోంది. అంతేకాదు.. స్టార్టప్ అదనపు ఛార్జీతో స్ట్రోలర్ రెంటల్స్‌ను కూడా అందిస్తోంది.
అయితే ఇప్పటివరకు వచ్చిన బుకింగ్స్‌లో ఎక్కువ భాగం వృద్ధుల నుంచే కావడం విశేషం. బట్టలు, కర్టెన్లు, బెడ్షీట్లు కొనే వృద్ధులకు లగ్జరీ కంటే చిన్నపాటి సాయం అవసరమవుతుంది. కూర్చోవడానికి చోటు చూపించడం, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సాయం చేయడం వంటివి వీరు చూసుకుంటారు. ఇందుకోసం ఈ టీమ్ ఒక అడుగు ముందుకు వేసి ‘పోర్టబుల్ క్యాంపింగ్ చైర్స్’ (మడత కుర్చీలు) కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్ అలసిపోతే మార్కెట్ మధ్యలోనే ఆ కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఎండ, వానల కోసం గొడుగులు, మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్, పవర్ బ్యాంకులు, తాగునీటి సదుపాయం కూడా ఇందులో భాగమే. “ఇది కేవలం బ్యాగులు మోయడం మాత్రమే కాదు.. షాపింగ్ స్ట్రెస్‌ను తగ్గించి, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, కుటుంబాలకు మార్కెట్లను మరింత కంఫర్టబుల్‌గా మార్చడం” అని ప్రతినిధి వివరించారు. అయితే ఒక అసిస్టెంట్ గరిష్టంగా 12 కేజీల బరువు మాత్రమే మోయగలడు. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే మరో అసిస్టెంట్‌ను హైర్ చేసుకోవాలి.
ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభమైన ఈ స్టార్టప్, మొదటి నెలలోనే 50కి పైగా బుకింగ్స్ పూర్తి చేసుకుంది. ఎటువంటి భారీ ఇన్ఫ్లుయెన్సర్ ప్రచారాలు లేకుండా కేవలం ‘మౌత్ టాక్’ (ఒకరి ద్వారా ఒకరికి తెలిసి) ద్వారానే ఇది వైరల్ అయింది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ కేవలం లజ్‌పత్ నగర్లోనే అందుబాటులో ఉంది, త్వరలోనే చాంద్నీ చౌక్‌కు కూడా విస్తరించనున్నారు. కాబట్టి, నెక్స్ట్ టైమ్ ఎవరైనా “పద లజ్‌పత్ వెళ్దాం” అంటే అప్పుడే భుజాల నొప్పులు గుర్తొచ్చి భయపడాల్సిన పనిలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మన చిన్నప్పటి షాపింగ్ జ్ఞాపకాలన్నీ మనతో వచ్చే మనుషులతోనే ముడిపడి ఉంటాయి. ఇక, ఇలాంటి స్టార్టప్‌లు మన షాపింగ్ లోడ్స్ తగ్గించగలవేమో కానీ, మనకు నచ్చిన వారు మన పక్కన ఉంటే ఇచ్చే ఆ ఎమోషనల్ కంఫర్ట్‌ను ఏ సర్వీస్ కూడా రీప్లేస్ చేయలేదు కదా!!
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!