NTV Telugu Site icon

Buy a car on Amazon: అమెజాన్‌లో కారు కొనుగోలు చేయాలా.? త్వరలో వాస్తవం కాబోతోంది..

Amazon

Amazon

Buy a car on Amazon: ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఫ్యాషన్, హోం యుటిలిటీ ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి. భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కి జనాలు కూడా బాగానే అలవాటయ్యారు. ఇదిలా ఉంటే కార్లను ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారంలో కొనుగోలు చేసే రోజు దూరంలో లేదు, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది.

అమెజాన్‌లో కారు కొనాలా..? అయితే ఇది కొన్ని రోజుల్లో వాస్తవం కాబోతోంది. అమెజాన్ ఆటోమోటివ్ రంగంలోకి అడుగుపెట్టింది. వర్చువల్ షోరూం ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే కాకుండా వివిధ బ్రాండ్లకు సంబంధించి కార్లను ధరలు, ఫీచర్లను పోల్చి చూసేలా కస్టమర్లకు సేవలు అందించబోతోంది. దీని కోసం హ్యుందాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు వినియోగదారులు వెబ్‌‌సైట్ ద్వారా కారు భాగాలు, ఇతర ఉపకరణాలు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ తీసుకున్న ఈ స్టెప్ కార్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది, డీలర్‌షిప్ విజిబిలిటీని మెరుగుపరుస్తుంది.

Read Also: Aadikeshava: మమ్మల్ని క్షమించండి.. సరైన సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాం

దీనికి ముందు అమెజాన్ యూజర్లు కార్ల కోసం ధరలను పోల్చి చూసే సదుపాయాన్ని కొన్ని దేశాల్లో అందించింది. అయితే వచ్చే ఏడాది నుంచి హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల ద్వారా అమెజాన్‌లో అమ్మకానికి కార్ మోడళ్లను లిస్ట్ చేయనుంది. కస్టమర్లు సైట్ ద్వారా వివిధ కార్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. వారి పేమెంట్ పద్ధతుల ద్వారా కారును కొనుగోలు చేసి సమీపం డీలర్ వద్దను నుంచి కార్ తీసుకోవచ్చు. లేదంటే నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేసుకోవచ్చు.

అమెజాన్ ద్వారా లావాదేవీలు జరిగినప్పటికీ.. ఇందులో అసలు విక్రేతగా సదరు కార్ కంపెనీ డీలర్ ఉంటారు. డీలర్ షిప్‌ని కనెక్ట్ చేసే మధ్యవర్తిగా అమెజాన్ పనిచేస్తుంది. అయితే ఇతర కార్ కంపెనీలు, అమెజాన్‌తో జట్టుకడుతాయో లేదో చూడాలి. అమెజాన్ ద్వారా డీలర్లను దగ్గర చేయడంతో పాటు, వినియోగదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ మేరకు హ్యుందాయ్‌తో అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పటికే టెస్లా తన వెబ్‌సైట్ ద్వారా కార్లు కొనుగోలు చేసేలా డైరెక్ట్ టూ కన్సూమర్ ఆప్రోచ్ విధానాన్ని తీసుకువచ్చింది.