Site icon NTV Telugu

Deepinder Goyal: వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసిన దీపిందర్ గోయల్! రాజీనామాకు రీజన్ ఇదేనా?

Deepinder Goyal

Deepinder Goyal

Deepinder Goyal: జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఎటర్నల్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయన ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. నిజానికి 18 ఏళ్ల క్రితం ఆయన స్థాపించిన కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగాలని తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదే టైంలో ఆయన తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ కంపెనీ వాటాదారులకు ఒక లేఖ కూడా రాశారు. ఈ స్టోరీలో ఆయన రాజీనామాకు కారణం అయిన విషయాలను తెలుసుకుందాం.

READ ALSO: Mallikarjun Kharge: మోడీ ఎప్పుడైనా టీ చేశారా.. ఓట్ల కోసమే ‘‘చాయ్‌వాలా’’గా చెప్పుకున్నారు..

నిజానికి దీపిందర్ ఎటర్నల్ గ్రూప్‌తో పాటు అనేక ఇతర స్టార్టప్‌లతో కూడా సంబంధం కలిగి ఉన్నారు. ఇది ఆయన CEO పదవికి రాజీనామా చేయడానికి కారణం కావచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన స్టోరీలో “కొన్ని కొత్త ఆలోచనలు నా దృష్టిని ఆకర్షిస్తున్నాయి, వాటిలో కొన్ని చాలా రిస్క్, ప్రయోగాలను కలిగి ఉంటాయి. ఇవి ఎటర్నల్ వంటి పబ్లిక్ కంపెనీ నుంచి దూరంగా కొనసాగించాల్సిన ఆలోచనలు. ఎటర్నల్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవడం ద్వారా, ఈ కొత్త ఆలోచనలపై పని చేయడానికి నాకు సమయం దొరుకుతుంది” అని రాసుకొచ్చారు.

నిజానికి దీపిందర్ గోయల్ పేరు ఇటీవల అనేక కొత్త ప్రాజెక్టులతో ముడిపడి ఉన్నట్లు వినిపిస్తుంది. అలాంటి ఒక ప్రాజెక్ట్ టెంపుల్. ఇది ఒక డివైజ్. పలు సందర్భా్ల్లో గోయల్ ఈ డివైజ్‌ను తన నుదిటిపై ధరించి వివిధ ప్రదేశాలలో కనిపించాడు కూడా. నిజానికి టెంపుల్ అనేది మెదడు రక్త ప్రవాహాన్ని నిజ సమయంలో పర్యవేక్షించడానికి రూపొందించిన పరికరం. అయితేఈ పరికరం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గోయల్ కంటిన్యూ రీసెర్చ్ సహకారంతో ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. టెంపుల్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందో, దానిలో ఏ ఫీచర్లు ఉంటాయో కంపెనీ ఎటువంటి ప్రకటనలు చేయలేదు. దీపిందర్ కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

ఆయన మరో ఆలోచన LAT ఏరోస్పేస్. జనవరి 2025లో స్థాపించిన ఈ ఏవియేషన్ స్టార్టప్, తక్కువ టేకాఫ్, ల్యాండింగ్ సమయాలు కలిగిన విమానాలపై పనిచేస్తోంది. ఇటీవల దీపిందర్ కంపెనీ 6 నుంచి 8 సీట్లతో విమానాలపై పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ విమానాలు చిన్న ప్రదేశాల నుంచి టేకాఫ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి విమానాలను అభివృద్ధి చేయలేదని ఆయన వివరించారు. ఈ విమానాలు చిన్న ప్రదేశాలలో పనిచేయగలవు, చిన్న ప్రయాణాలకు కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్టులే దీపిందర్ గోయల్ ఎటర్నల్ CEO పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడానికి కారణం కావచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: T20 World Cup 2026: వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఇక పాకిస్థాన్ వంతు?

Exit mobile version