PhonePe IPO: వాల్‌మార్ట్‌కు సంబంధించిన డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే IPO (స్టాక్ మార్కెట్ లిస్టింగ్) కోసం SEBI ఆమోదం పొందింది. పలు నివేదికల ప్రకారం.. ఇది కంపెనీకి ఒక ప్రధాన నియంత్రణ అడ్డంకిని తొలగిస్తుందని, భారతదేశంలోని అతిపెద్ద ఫిన్‌టెక్ IPOలలో ఇది ఒకటి కావచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్‌పే వాల్యుయేషన్‌ల గురించి చర్చ కొనసాగుతున్నప్పటికీ, పెట్టుబడిదారులకు పెద్ద టెక్ ప్లాట్‌ఫామ్‌లపై ఆసక్తి బలంగా ఉన్న టైంలో ఈ ఆమోదం లభించింది.
ఫోన్‌పే IPO ఎంత సేకరించాలని ప్లాన్ చేస్తుందంటే..
పలు నివేదికల ప్రకారం.. PhonePe ఈ IPO ద్వారా సుమారు $1.5 బిలియన్లను సేకరించాలని చూస్తోంది. అయితే లిస్టింగ్ సమయంలో ఈ మొత్తం మారవచ్చని పలువురు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ఈ ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్ (OFS)గా ఉంటుందని సమాచారం. 2025 చివరిలో జనరల్ అట్లాంటిక్ నేతృత్వంలోని $600 మిలియన్ల రౌండ్ నిధుల తర్వాత PhonePe యొక్క విలువ $14.5 బిలియన్లుగా నివేదించారు. గతంలో మే 2023లో కంపెనీ విలువ $12.5 బిలియన్లుగా ఉంది, ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు.
డిసెంబర్ 2015లో ప్రారంభించిన PhonePe భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపు వేదికగా అవతరించింది. ఈ కంపెనీకి 435 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. ఉదాహరణకు దాదాపు నలుగురిలో ఒకరు ఏదో ఒక రూపంలో PhonePeని ఉపయోగిస్తున్నారు. ఇది వ్యాపారి నెట్‌వర్క్ పరంగా టైర్-2, టైర్-3, చిన్న నగరాల్లో దాదాపు 35 మిలియన్ల వ్యాపారులను ఆన్‌బోర్డ్ చేసింది. ప్రస్తుతం ఫోన్ పే సేవలు భారతదేశంలోని 99% పిన్‌కోడ్‌లను చేరుకుంటున్నాయి.
PhonePe IPO ఎప్పుడు వస్తుందంటే..
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)లో కూడా PhonePe ఒక ప్రధాన పాత్రధారి, మొత్తం లావాదేవీలలో 45% కంటే ఎక్కువ ప్రాసెస్ చేస్తోంది. డిసెంబర్ 2025లోనే కంపెనీ 9.8 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. చెల్లింపులకు మించి PhonePe మ్యూచువల్ ఫండ్స్, బీమా వంటి ఆర్థిక ఉత్పత్తులలోకి కూడా ప్రవేశించింది. కంపెనీ ఇప్పుడు తనను తాను చెల్లింపుల యాప్‌గా మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి ఆర్థిక సేవల ప్లాట్‌ఫామ్‌గా మలుచుకుంటుంది. ఈ యాప్ ఆర్థిక పనితీరు విషయానికొస్తే, 2024-25లో కంపెనీ నష్టాలు రూ.1,727 కోట్లకు తగ్గాయి. ఇదే టైంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 40% పెరిగి రూ.7,115 కోట్లకు చేరుకుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, JP మోర్గాన్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రధాన పెట్టుబడి బ్యాంకులు ఫోన్‌పే IPOను నిర్వహిస్తాయి. ఇప్పుడు SEBI ఆమోదం పొందిన తర్వాత ఈ కంపెనీ IPOతో ముందుకు సాగుతుంది. అయితే అది ఎప్పుడు ఐపీఓకు వస్తుంది అనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: 73 Year Old Man Fitness: ఈ తాత ‘సిక్స్ ప్యాక్’ చూస్తే కుర్రహీరోలు కూడా కుళ్లుకోవాల్సిందే!