NTV Telugu Site icon

Business Idea: చలికాలంలో అదిరిపోయే బిజినెస్.. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు..

Bussiness Plan

Bussiness Plan

బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికీ వస్తాయి.. కానీ కొంతమంది మాత్రమే దాన్ని మొదలు పెట్టి చూపిస్తారు.. ఒకప్పటిలా ఒకే బిజినెస్‌ను ఏళ్లపాటు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా కొన్ని నెలలు మాత్రమే వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది.. సీజన్ కు తగ్గట్లు బిజినెస్ లు కూడా మారుతూ ఉంటాయి.. మూడు నెలల వరకు వ్యాపారాన్ని చేయడం ఆ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఒక ట్రెండ్‌.. చలికాలంలో బెస్ట్ బిజినెస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్కీన్స్‌కు, ఉలెన్‌ దుస్తువులకు మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతోంది. చలి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ష్వటర్లను కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఈ సీజన్‌ను క్యాష్‌ చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈ వ్యాపారాన్ని చెయ్యడానికి కేవలం రెండు నుంచి మూడు వారాలు మాత్రమే.. జాకెట్స్‌, స్వెటర్లు, శాలువలు వంటి వాటిని విక్రయించడం ద్వారా లాభాలను పొందొచ్చు. అయితే అతి తక్కువ కాలం వ్యాపారం చేయాలనుకునే వారు రిటైల్‌గా కాకుండా హోల్‌సేల్‌గా విక్రయించాలి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందొచ్చు. భారీ ఎత్తున దుస్తులను కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు హోల్‌సేల్‌లో అమ్మితే మంచి లాభాలను పొందొచ్చు..

ఇకపోతే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 2 నుంచి రూ. 3 లక్షల ఆదాయం పెట్టుబడి పెడితే సరిపోతుంది. లేదు పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలనుకుంటే రూ. 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. తక్కువ ధరకు దుస్తులను కొనుగోలు చేయాలనుకుంటే. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి ఆర్డర్‌ చేసుకోవచ్చు.. పెద్ద గోడౌన్ లో పెట్టి ఆ తర్వాత చిన్న చిన్న దుకాణాలకు సప్లై చేసుకోవచ్చు. ఇక కేవలం హోల్‌సేల్‌గానే కాకుండా రిటైల్‌గా కూడా విక్రయించుకోవచ్చు. ఈ దుస్తులపై సుమారు 30 నుంచి 40 శాతం వరకు లాభం పొందొచ్చు.. కేవలం ఈ మూడు నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందవచ్చు..